విదేశాల్లో రిజర్వు బ్యాంక్ వద్ద ఉన్న బంగారం నిల్వలు తగ్గుముఖం పట్టాయి. మార్చి 2024 నాటికి గోల్డ్ రిజర్వులు 47 శాతం వరకు తగ్గాయి. 2017 తర్వాత ఇదే కనిష్ఠ స్థాయి కావడం విశేషం. విదేశాల్లో ఉన్న బంగారం నిల్వలను దేశానికి తరలిస్తుండటం ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా బంగారం రిజర్వులు సెప్టెంబర్ 2021లో 39 శాతంగా ఉండగా, మార్చి 2024 నాటికి ఇవి 53 శాతానికి ఎగబాకాయి. ప్రస్తుతం ఆర్బీఐ వద్ద 822.1 టన్నుల బంగారం ఉంది.