హీరో నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం ‘రాబిన్ హుడ్’. ఈ మూవీలో నితిన్ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రీ మూవీస్ నిర్మిస్తున్న ఈ మూవీని క్రిస్మస్ కానుకగా గతేడాది డిసెంబరు 25న విడుదల చేయనున్నట్లు ప్రకటించి తర్వాత వాయిదా వేశారు. అయితే తాజాగా సినిమా రిలీజ్ డేట్‌ను మూవీ మేకర్స్ ప్రకటించారు. సమ్మర్ కానుకగా మార్చి 28న వరల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు తెలిపారు.