సినీ నటి, ఏపీ మాజీ మంత్రి రోజా ఫ్యామిలీతో కలిసి యూరప్ పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె ఇటలీలో తిరుగుతుండగా దూరం నుంచి తీసిన ఓ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన రోజా.. నగరి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో పాటు వైసీపీ అధికారం కోల్పోవడంతో కాస్త సైలెంట్ అయ్యారు. రోజా ఫొటో వైరల్ అవుతుండటంతో నెటిజన్లు పలు రకాల కామెంట్స్ చేస్తున్నారు.