తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి రూ.11,600కోట్లు కేటాయించామని భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను మొదటి విడతలో నిర్మిస్తున్నామని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఒక యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తామని, ఆ స్కూల్స్‌లో ఐఐటీ-జేఈఈ, నీట్ కోచింగ్‌తో పాటు ఉచిత వసతులు కల్పిస్తామని అన్నారు. గురుకులాల కోసం డైట్ ఛార్జీలు 40 శాతం, కాస్మోటిక్ ఛార్జీలు 200 శాతం పెంచమని వెల్లడించారు.