తెలంగాణలో ఎండిపోయిన పంటలకు ఎకరానికి రూ.25,000 ఇవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని విమర్శించారు. భూగర్భ జలాలు అడుగంటడం, చెరువులు, చెక్ డ్యాంలలో నీరు నింపకుండా ఇసుక దోపిడీతో నాయకుల జేబులు నింపారని ఆరోపించారు.