అమరావతి నిర్మాణానికి రూ.31,600 కోట్లు: మంత్రి నారాయణ

78చూసినవారు
అమరావతి నిర్మాణానికి రూ.31,600 కోట్లు: మంత్రి నారాయణ
AP: రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.31,600 కోట్లు వెచ్చిస్తున్నట్టు మంత్రి నారాయణ వెల్లడించారు. ఖర్చు పెట్టే నిధులన్నింటినీ కేంద్ర ప్రభుత్వం సహా వివిధ బ్యాంకుల నుంచి రుణం రూపంలో తీసుకుంటున్నట్టు తెలిపారు. రాజధాని నిర్మాణానికి వరల్డ్ బ్యాంకు, ఏషియన్‌ బ్యాంకు కలిపి రూ.15వేల కోట్లు ఇస్తున్నాయన్నారు. హడ్కో నుంచి రూ.15వేల కోట్లు, జర్మన్‌కు చెందిన బ్యాంకు KFW ద్వారా రూ.5వేల కోట్లు రుణం తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you