ఫోన్ చూస్తూ బస్సు నడిపిన RTC డ్రైవర్ (వీడియో)

62చూసినవారు
ఏపీలోని ప్రకాశం జిల్లాలో ఆగస్టు 31న షాకింగ్ ఘటన జరిగింది. పొదిలి RTC డిపో డ్రైవర్ ఎండీ మస్తాన్ ఫోన్ చూస్తూ బస్సు నడిపాడు. భారీ వర్షంలో డ్రైవర్ ఫోన్ చూస్తూ బస్సు నడుపుతుండడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. కొందరు ప్రయాణికులు ఆ డ్రైవర్‌ను ఇలా చేయొద్దని వారించారు. అయితే డ్రైవర్ పట్టించుకోలేదు. ఫోన్ కాల్ మాట్లాడుతూ పొదిలి నుంచి ఒంగోలు వరకు బస్సు నడిపాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్