సైన్యం పాలనలో మయన్మార్ ప్రజలు తీవ్రంగా సతమతమవుతున్నారు. తాజాగా ఉద్యోగులకు జీతాలు పెంచారన్న కారణంతో కొంతమంది దుకాణ యజమానులను అక్కడి సైనిక ప్రభుత్వం జైలుకు పంపించింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న వేళ సిబ్బందికి వేతనాలను పెంచడం నేరంగా పరిగణించింది. 10 మంది దుకాణదారులకు ఇదే కారణంతో మూడేళ్ల జైలు శిక్ష విధించింది. అంతేగాక, వారి వ్యాపారాలను బలవంతంగా మూసివేయించింది.