AP: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల ఉత్తీర్ణతా శాతాన్ని పెంచేందుకు ‘సంకల్ప్-2025’ కార్యక్రమాన్ని విద్యా మండలి రూపొందించింది. క్వార్టర్లీ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులను ప్రోత్సహించేందుకు లెక్చరర్లు, ఇతర సిబ్బందిని కేర్ టేకర్లుగా నియమించింది. ప్రతి కాలేజీలో విద్యార్థులను మూడు కేటగిరీలుగా విభజస్తారు. సీ-గ్రూపు విద్యార్థులకు క్వశ్చన్ బ్యాంక్‌లు ఇస్తారు. ప్రతిరోజూ సాయంత్రం 3 నుంచి 5 గంటల వరకు వారికి స్టడీ అవర్లు నిర్వహిస్తారు.