TG: SC వర్గీకరణపై కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. చాతుర్వర్ణ వ్యవస్థ క్రమంగా పంచమ వ్యవస్థగా మారిందని కామెంట్ చేశారు. పంచములు అస్పృశ్యత, అంటరానితనానికి గురయ్యారని, వివక్షను రూపుమాపేందుకు రిజర్వేషన్లు కల్పించారని అన్నారు. SC వర్గీకరణ జరపాలని మొదటి లోకూర్ కమిటీ 1965లోనే సూచించిందని పేర్కొన్నారు. మొదట పంజాబ్‌లో ఎస్సీ వర్గీకరణ అమలైందని మంత్రి గుర్తుచేశారు.