పైనుంచి చూస్తే పనసకాయల లోడే.. లోపల?

1089చూసినవారు
పైనుంచి చూస్తే పనసకాయల లోడే.. లోపల?
HYD: శామీర్ పేట్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో ఓ గంజాయి మఠా గుట్టు రట్టయింది. బోలెరో వాహనంతో పాటు పెట్రోలింగ్ వ్యవహరించిన మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరాడ సాయి, బండారు శివకుమార్, గేదెల సతీష్‌లను అదుపులోకి తీసుకుని.. 35 కిలోలకు పైగా గంజాయిని సీజ్ చేశారు. పట్టుబడ్డ గంజాయి విలువ రూ. 8 లక్షల వరకు ఉండవచ్చని అంచనా. నిందితులను రిమాండుకు తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు మేడ్చల్ డీసీపీ తెలిపారు.