లవ్ మ్యారేజ్‌లపై హైకోర్టు సంచలన తీర్పు

83చూసినవారు
లవ్ మ్యారేజ్‌లపై హైకోర్టు సంచలన తీర్పు
మేజర్లు తమకు నచ్చిన వ్యక్తితో ఇష్టమైన చోట బతకకుండా ఎవరూ ఆపలేరని అలహాబాద్ హైకోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి ఒక్కరికీ ప్రాణ రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛను అందిస్తోందని తెలిపింది. మేజరైన ఓ జంట ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోగా.. భార్య తరపు బంధువులు భర్తపై కిడ్నాప్ కేసు పెట్టడాన్ని న్యాయస్థానం తోసిపుచ్చుతూ ఈ కామెంట్స్ చేసింది.

సంబంధిత పోస్ట్