తీవ్ర గురకతో క్యాన్సర్ ముప్పు
మీరు రోజూ భారీగా గురక పెడుతున్నారా?.. అయితే జాగ్రత్త! గురక కొన్నిరకాల క్యాన్సర్లకు దారితీస్తోందని ఓ తాజా అధ్యయనం హెచ్చరిస్తోంది. నిద్ర పోతున్నప్పుడు కొందరికి గొంతు వెనకాల భాగం వదులై పాక్షికంగానో, పూర్తిగానో శ్వాస మార్గానికి అడ్డుపడుతుంది. దీంతో ఊపిరాడక ఉన్నట్టుండి శ్వాస తీసుకుంటూ గట్టిగా గురక పెడతారు. దీన్నే అబ్‌స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా అంటారు. ఈ స్లీప్ అప్నియా ఉన్నవారిలో ఎక్కువ మందికి క్యానర్ ఉందని తేలింది.