జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ అరాచకాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. కొడుకు స్కూల్ అడ్మిషన్ కోసం వెళ్లిన తనను ప్రజ్వల్ లైంగికంగా వేధించినట్లు ఓ మహిళ తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆన్‌లైన్‌లో వర్చువల్‌గా శృంగారం చేయాలంటూ అతను ఒత్తిడి చేశారని తెలిపారు. 2019-20 మధ్య 8-10 సార్లు ఇలా చేశారని, వీడియో రికార్డింగ్ చేసి బెదిరించారని తెలిపారు.