మహారాష్ట్ర సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ అలాగే కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఆపధర్మ సీఎం ఏక్‌నాథ్ షిండే స్పందించారు.‘ప్రజలు ఆశించిన విధంగా మా ప్రభుత్వం పాలన అందించేందుకు మరోసారి సిద్ధంగా ఉంది. అయితే మహారాష్ట్ర సీఎంగా ఎవరు ఉండాలనేది బీజేపీ నిర్ణయం తీసుకుంటుంది. అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను. ఈ విషయంలో మా కూటమిలో ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు’ అని షిండే పేర్కొన్నారు.