సోషల్ మీడియాలో ఫేమ్ అవ్వడం కోసం కొందరు యువకులు ప్రమాదకరమైన రీల్స్ చేస్తుంటారు. తాజాగా ముగ్గురు యువకులు బురదలో ఉండి తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఒక యువకుడిని బురదలో పూర్తిగా పూడ్చిపెట్టి రీల్స్ చేశారు. ఈ వీడియోలో జాతీయ జెండాతో ఓ యువకుడు వీడియోను లైక్ చేయమని కోరుతున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు. పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.