షాకింగ్.. అందరి ముందు యూనిఫాం చించుకున్న పోలీస్ (వీడియో)

570చూసినవారు
ఓ నేత బెదిరించడంతో ఆగ్రహానికి గురైన పోలీస్ అధికారి అందరి ముందు తన యూనిఫాం చించేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. సింగ్రౌలీ జిల్లా పోలీసు అధికారులు, బీజేపీ సభ్యుల మధ్య సమావేశం జరుగుతుండగా, ఓ బీజేపీ నేత అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్‌కి అందరి ముందు వార్నింగ్ ఇచ్చాడు. ‘నీ యూనిఫాం తీసేస్తాం’ అంటూ బెదిరించాడు. దీంతో ఆగ్రహానికి గురైన ఏఎస్ఐ తన యూనిఫాం చించేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్