షాకింగ్ వీడియో.. చిన్న పిల్లాడితో బావి అంచున కూర్చొని రీల్స్ చేస్తున్న మహిళ

75చూసినవారు
రీల్స్ పిచ్చి ఎంత ముదిరిపోయిందో తెలియజెప్పే మరో వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ మహిళ చిన్నాపిల్లాడితో సహా ఓ బావి అంచున కూర్చొని రీల్స్ చేసింది. అందులోనూ బావికి లోపల పక్క కూర్చోవడం విశేషం. కొంచెం అదుపుతప్పినా ఇద్దరూ బావిలో పడడం ఖాయం. అయితే ఏమాత్రం భయం లేకుండా ఓ పాటకు డ్యాన్స్ చేసింది. బుడ్డోడికి భయం వేసిందో ఏమో ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్