బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-భారత్ జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. అయితే వేలికి గాయం కారణంగా గిల్‌కు మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. ఈ క్రమంలో బీసీసీఐ గిల్ గురించి అప్డేట్ ఇచ్చింది. పూర్తిగా కోలుకోకపోవడంతో గిల్‌ను తొలి టెస్టుకు ఎంపిక చేయలేదని పేర్కొంది. బుమ్రా సారథ్యంలో బరిలోకి దిగిన టీమ్ ఇండియా 40 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.