మాట నిలబెట్టుకున్న పవన్ కళ్యాణ్: జనసేన (వీడియో)
AP: మన్యం ప్రజలకు ఇచ్చిన మాటను జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని జనసేన ట్వీట్ చేసింది. ఈ మేరకు ఒక వీడియోను షేర్ చేసింది. 2018లో పవన్ అరకులో పర్యటించారు. ఆ సమయంలో ఆయన తాను అధికారంలోకి వస్తే రోడ్లు నిర్మిస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 19 పంచాయతీలకు రూ.40 కోట్లు మంజూరు చేశారు. ఇకపై ఏడాదికి రూ.350 కోట్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటానని పవన్ హామీ ఇచ్చారు.