స్కూళ్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
AP: స్కూళ్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 నుంచి ప్రాథమికోన్నత పాఠశాల విధానాన్ని తీసేయనుంది. 6, 7, 8 తరగతుల్లో 30 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉంటే ప్రైమరీ, 60 కంటే ఎక్కువ మంది ఉంటే ఉన్నత పాఠశాలగా మార్చనుంది. అలాగే బేసిక్, ఆదర్శ స్కూళ్లనూ ప్రభుత్వం నిర్వహించనుంది. బేసిక్‌లో 20 మందిలోపు పిల్లలు ఉంటే ఒక ఎస్జీటీ, 60 మందికి ఇద్దరు ఎస్జీటీలను కేటాయించనుంది. ఆదర్శ్ స్కూళ్లలో ప్రతి తరగతికి ఒక ఎస్జీటీ కేటాయిస్తుంది.