దేవుడికి దీపం.. గుడికి వెళ్లొచ్చేసరికి ప్రమాదం

65చూసినవారు
ఉగాది రోజు ఓ ఇంట్లో అపశ్రుతి చోటుచేసుకొంది. నార్సింగి పరిధి హైదర్షాకోట్ లోని ఓ ఇంట్లో దేవుడికి దీపం పెట్టి గుడికి వెళ్లి వచ్చేసరికి ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టంగా పొగ అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపుచేశారు. స్వల్పంగా ఆస్థి నష్టం జరిగినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :