ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేసే నాయకులను ఎన్నుకోవాలని బిఆర్ఎస్ నాయకులు కోరారు. మెదక్ పార్లమెంటు బిఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామారెడ్డికి మద్దతుగా ఆయన కుమారుడు సుప్రీత్ రెడ్డి తో పాటు బిఆర్ఎస్ నాయకులు కొండపాక మండలం సిరసనగండ్ల , గిరాయిపల్లి గ్రామాల్లో శుక్రవారం ప్రచారం నిర్వహించారు.