ఉయ్యాలలో ఉన్న బాలుడి అపహరణ
నెల్లూరు జిల్లాలోని వెంగళరావునగర్లో ఉయ్యాలలో ఉన్న బాలుడి అపహరణ జరిగింది. తేజ (14 నెలలు) అనే బాలుడిని ఉయ్యాలలో ఉంచి తల్లి రాజేశ్వరి స్నానానికి వెళ్లింది. స్నానం చేసి వచ్చేసరికి ఉయ్యాలలో తేజ కనిపించలేదు. దాంతో చుట్టుపక్కల వాళ్లను తల్లి రాజేశ్వరి అడిగారు. ఫలితం లేకపోవడంతో కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో తేజ అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.