బిజెపికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు

58చూసినవారు
బిజెపికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
భారతీయ జనతా పార్టీకి ప్రచారంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపు ఖాయమని సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం సిద్దిపేటలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మోహన్ రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు అన్ని అబద్ధాలే అని కొట్టిపారేశారు. సిద్దిపేట అభివృద్ధి కేంద్రం ఇచ్చిన నిధులతోనే జరిగిందన్నారు.

ట్యాగ్స్ :