మలేషియా మాస్టర్స్‌లో సింధు శుభారంభం

57చూసినవారు
మలేషియా మాస్టర్స్‌లో సింధు శుభారంభం
మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత క్రీడాకారిణి పి.వి.సింధు శుభారంగం చేసింది. తొలి రౌండ్‌లో సింధు 21-17, 21-16తో స్కాట్లాండ్ క్రీడాకారిణి కిర్‌స్టీ గిల్మోర్‌పై విజయం సాధించింది. ఈ పోరులో ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన ఎదురైనప్పటికీ.. సింధు దూకుడుగా ఆడి విజయం సాధించింది. తర్వాతి మ్యాచ్‌లో ఆమె.. సిమ్ యు జిన్ (దక్షిణ కొరియా)తో ఆడనుంది.

ట్యాగ్స్ :