చొప్పదండి - Chopadandi

కరీంనగర్ లో భారీ మెజారిటీతో గెలువబోతున్న : వినోద్ కుమార్

కరీంనగర్ లో భారీ మెజారిటీతో గెలువబోతున్న : వినోద్ కుమార్

కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ప్రజల ఆశీర్వాదంతో భారీ మెజారిటీతో గెలవబోతున్నట్లు కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కరీంనగర్ ప్రజల తెలివి మాటల్లో చెప్పలేనిదన్నారు. కరీంనగర్ పార్లమెంటు పరిధిలో గతంలో తను ఎంపీగా చేసిన పనులే తనను మళ్ళీ గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ ప్రజలు తనకే పట్టం కట్టబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని వినోద్ కుమార్ తెలియజేశారు. ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చే బాధ్యత తనపై ఉందని కరీంనగర్ పార్లమెంటు ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసుకోనని తెలిపారు.

వీడియోలు


కరీంనగర్ జిల్లా