బాధిత కుటుంబాలకు యూత్ సభ్యుల ఆర్థిక సహాయం

1080చూసినవారు
బాధిత కుటుంబాలకు యూత్ సభ్యుల ఆర్థిక సహాయం
ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన మగ్గిడి శ్రీను నిరుపేద కుటుంబానికి చెందినవాడు. గత కొంతకాలంగా ఆయన పక్షవాతం వ్యాధితో బాధపడుతున్నాడు. వారి ఆర్థిక ఇబ్బందులను గమనించిన స్థానిక భూలక్ష్మి యూత్ సభ్యులు గురువారం వారి కుటుంబానికి రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు. అంతేకాకుండా గతవారం కట్ట శ్రీజ ఆత్మహత్య చేసుకుని మరణించగా వారి కుటుంబ సభ్యులకు కూడా రూపాయలు ఐదువేల ఆర్థిక సహాయం అందజేశారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్