తెలంగాణ నుంచి ఏపీకి చెందిన ఆరుగురు ఐఏఎస్‌లను TG ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్‌ను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోనే కొనసాగించాలని హైకోర్టు వరకు వెళ్లినా వీరికి ఊరట దక్కలేదు. రిలీవ్ అయిన స్థానాల్లో ఆరుగురు ఐఏఎస్‌లకు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆమ్రపాలి స్థానంలో ఇలంబర్తికి జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది .