SL vs IND: రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ కైవసం
IND vs SL రెండో టీ20 మ్యాచ్‌లో 6.3 ఓవర్లలో 81/3 పరుగులు చేసి శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. భారత బ్యాటర్లలో జైస్వాల్ 30, సూర్య కుమార్ 26, హార్దిక్ పాండ్య* 22, పంత్* 2 పరుగులు చేశారు. అంతకుముందు మ్యాచ్ జరుగుతుండగా వర్షం పడడంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ నిబంధన ప్రకారం భారత లక్ష్యాన్ని 8 ఓవర్లల్లో 78 పరుగులకు కుదించారు.