లేడీ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో అరెస్ట్ అయిన జానీ మాస్టర్‌ను పోలీసులు శుక్రవారం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరిచారు. ఆ సమయంలో జానీ మాస్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఆమెపై ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదన్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగా ఆమెతో ఫిర్యాదు చేయించి, తనను ఈ కేసులో ఇరికించారన్నారు. దీనిపై లీగల్‌గా పోరాడుతానని స్పష్టం చేశారు.