అనారోగ్యంతో బాధపడుతూ ‘నీట్’ పరీక్షకు హాజరుకానున్న ఓ విద్యార్థినికి ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని మద్రాస్ హైకోర్టు మదురై ధర్మాసనం గురువారం ఆదేశించింది. అనారోగ్యంతో బాధపడుతున్న తాను, మూత్రవిసర్జనను నియంత్రించలేని స్థితిలో ఉన్నానని, మాటిమాటికీ డైపర్ మార్చాల్సిన పరిస్థితి ఉన్నందున.. అందుకు అవసరమైన వెసులుబాటును కల్పించేలా ఉత్తర్వులు జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఓ 19 ఏళ్ల యువతి హైకోర్టును ఆశ్రయించింది.