సంక్రాంతి సందర్భంగా తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు!

74చూసినవారు
సంక్రాంతి సందర్భంగా తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు!
సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరికొన్ని ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసింది. తెలంగాణలోని కాచిగూడ/చర్లపల్లి నుంచి ఏపీలోని శ్రీకాకుళం రోడ్‌ మధ్య ఆరు ప్రత్యేక సర్వీసులు నడపనున్నట్లు వెల్లడించింది. జనవరి 11, 12, 15, 16 తేదీల్లో కాచిగూడ-శ్రీకాకుళం రోడ్‌ (07615), శ్రీకాకుళం రోడ్‌-కాచిగూడ (07616) మధ్య ఈ రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. అలాగే, చర్లపల్లి-శ్రీకాకుళం రోడ్డుకు 8, 9 తేదీల్లో రెండు రైళ్లు 07617, 07618 సర్వీసులందిస్తాయి.

సంబంధిత పోస్ట్