ఖైరతాబాద్ గణేశుడి వద్ద తొక్కిసలాట (వీడియో)

78చూసినవారు
HYD ఖైరతాబాద్‌లోని భారీ గణనాథుడిని చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఖైరతాబాద్ ఐమాక్స్ మార్గంలో తొక్కిసలాట జరిగింది. క్యూలైన్లలో భక్తులు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వృద్ధులు సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఇక భక్తులను అదుపు చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. ఈ అర్ధరాత్రి వరకే మహాగణపతి దర్శనానికి సమయం ఉండడంతో లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులెవరు ఖైరతాబాద్‌కు రావద్దు అంటూ ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది.

సంబంధిత పోస్ట్