దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.27 గంటల సమయంలో సెన్సెక్స్ 453 పాయింట్ల లాభంతో 75,064 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 135 పాయింట్లు పుంజుకొని 22,783 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎన్టీపీసీ, ఐసీఐసీఐ బ్యాంక్, టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, విప్రో, ఎం అండ్ ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.