HYD-ఎల్బీ నగర్ BRS ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని వెంటనే బర్తరఫ్ చేయాలని కేటీఆర్‌ను కాంగ్రెస్ నేత మధు యాష్కీ హెచ్చరించారు. హస్తినాపురం కార్పొరేటర్ సుజాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సుధీర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. సుజాత కాళ్లు మొక్కి సుధీర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని.. లేకపోతే మీ ఎమ్మెల్యేపై పరువు నష్టం దావా వేస్తామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. సుధీర్ రెడ్డి ఎక్కడ తిరిగినా మహిళలు చెప్పుతో తన్నే రోజులు వస్తాయన్నారు.