జాపత్రి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. జాపత్రిని నీటిలో మరిగించి తీసుకున్నా, జాపత్రి పొడిని గోరు వెచ్చటి నీటిలో వేసి తీసుకున్నా ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చు. జాపత్రిలో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. జాపత్రి నీటిని తరచూ తాగుతూ ఉంటే.. రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్ అవుతాయి. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉంటాయి. నిద్రలేమి, జీర్ణ సంబంధిత సమస్యలు కంట్రోల్ అవుతాయి.