శంకరాంబడి సుందరాచారి 1914 ఆగష్టు 10న తిరుపతిలో జన్మించారు. మదనపల్లెలో బిసెంట్ థియొసాఫికల్ కళాశాలలో ఇంటర్మీడియట్ వరకు చదివారు. చిన్నతనం నుండే ఆయన స్వతంత్ర భావాలను కలిగి ఉండేవారు. సనాతన సాంప్రదాయాలను పాటించేవారు కాదు. అందుకు ఆయన తండ్రి తరచు కోప్పడేవారు. తండ్రితో పంతానికి పోయి ఒకసారి ఇంటి నుంచి బయటికి కూడా వెళ్ళిపోయారు. సుందరాచారి జీవితపర్యంతం తన కోసం ఏమీ దాచుకోలేదు.