అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమి మీద అడుగుపెట్టారు. సునీత, బుచ్ విల్మోర్‌లతో పాటు మరికొందరు ఆస్ట్రోనాట్స్‌తో 'క్రూ డ్రాగన్ వ్యోమనౌక' తెల్లవారుజామున 3.27 గంటలకు సురక్షితంగా ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగింది. గతేడాది జూన్‌లో వీరు వెళ్లిన స్టార్ లైనర్ స్పేస్ షిప్‌లో సమస్యలు తలెత్తడంతో అక్కడే ఆగిపోయారు. దీంతో 9 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండిపోయారు.