బిసీల రాతలు మారాలంటే రాజ్యాధికారం బీసీలకే రావాలి -బిసి రాజ్యాధికార వ్యవస్థాపకుడు జిల్లెపల్లి వెంకటేశ్వర్లు

80చూసినవారు
బిసీల రాతలు మారాలంటే రాజ్యాధికారం బీసీలకే రావాలి -బిసి రాజ్యాధికార వ్యవస్థాపకుడు జిల్లెపల్లి వెంకటేశ్వర్లు
కోదాడ : నీతి, నిజాయతీ ఉన్న బిసీల తలరాతలు మారాలంటే రాజ్యాధికారం బిజీలకే రావాలని, జనాభాప్రాతిపథికన హక్కులు సాధించుకోవాలంటే బీసీ కులాలలే బిసీలు ఐక్యంగా ఉండాలని బిసి రాజ్యాధికారం వ్వవస్థాపకులు జిల్లేపల్లి వెంకటేశ్వర్లు పిలుపు నిచ్చారు. జూన్‌ 10న సూర్యాపేటలో జరిగే బిసి గర్జన కార్యక్రమం విజయవంతం చేసేందుకు కోదాడలో శనివారం అతిధిగ్రాంట్‌ హోటలో బిసి కులాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయన అద్యక్షత వహించి మాట్లాడుతూ బిసి సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు ఆర్‌ కృష్ణయ్య ద్వారానే బీసీలకు గుర్తింపు, అభివృద్ది లభించిందని ఆయన అడుగుజాడల్లో నడిచి బిసిల రాజ్యాధికారాన్ని సాధించుకునేందుకు భేషజాలు విడనాడి ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. బిసీలలో చైతన్య ఇంకా రావాల్సి ఉందని, రాజ్యాధికారమే బిసిల ప్రధాన లక్ష్యంగా అన్ని పార్టీలు పనిచేయాలని, బిసీలకు ఓటు బ్యాంకు ఉంది, అనుభవం ఉంది, అగ్రకులాల యింకా అణగతొక్కుతున్నాయని ఆయన ఆరోపించారు. బీసీ సామాజిక వర్గాలకు పగ్గాలు వస్తే వాల్ళుకు మనుగడ లేకుండా పోతుందని, బీసీలను సైకి రానీవ్వకుండా, రాజకీయంంగా, ఆర్ధికంగా ఎదగకుండా ఉండటానినిక జెందాల కింద్ర కుట్రలు జరగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరచి గ్రామస్థాయి నుంచి బిసిలు పటిష్టం అయి ఐక్యమత్యంగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు. జూన్‌ 10న సూర్యాపేటలో జరిగే బిసిగర్జన విజయవంతం చేయాలని పిలుపు నిస్తూ గర్జన పోస్టర్‌ను ఈ సందర్భముగా నాయకులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బొల్లంమల్లయ్యయాదవ్‌, ఈదుల కృష్ణయ్య, ఆవుల రామారావు, పారసీతయ్య, బొలిశెట్టి కృష్ణయ్య, కట్టెబోయిన శ్రీనివాస్‌యాదవ్‌, పిల్లుట్ల శ్రీను, నూనె సులోచన, పూసారఘు, తొట శ్రీను, సన్నీరు మురళి, కొక్కులక్ష్మినారాయÑ బ్రహం,గోపాల్‌, కోట మధు, ధనుంజయ్‌, కిషోర్‌, సైదయ్య, సట్టు నాగేశ్వరరావు, తదితరులు ఆపాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్