మరో వివాదంలో మంత్రి కొండా సురేఖ (వీడియో)
వేములవాడ పర్యటనలో భాగంగా సోమవారం మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. ద్వాదశి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మ. 3 గంటలకు నైవేద్యం సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఆ సమయంలో స్వామి వారి నైవేద్యాన్ని ఆపి మరీ.. మంత్రికి అధికారులు ప్రత్యేక పూజలు చేయించారు. దీంతో 30 నిమిషాలు ఆలస్యంగా స్వామి వారికి నివేదన సమర్పించారు. మంత్రి, అధికారుల తీరుపై భక్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.