సీపీఐ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష

254చూసినవారు
సీపీఐ ఆధ్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష
కరోనా బాధిత ప్రజలను ఆదుకోవడం కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఖండిస్తూ సిపిఐ జాతీయ సమితి పిలుపుమేరకు సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో తన ఇంట్లోనే సిపిఐ నాయకులు ధనంజయ నాయుడు ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నాడు. దీక్షకు సంఘీభావంగా మాజీ ఎంపీపీ పారేపల్లి శేఖర్ రావు, సిపిఎం మండల కార్యదర్శి కొదమగుండ్ల నగేష్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాజీ మార్కెట్ చైర్మన్ కొణతం చిన్న వెంకటరెడ్డి, పట్టణ అధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి, కౌన్సిలర్ బచ్చలకూరి ప్రకాష్.తెలుగుదేశం పార్టీ వాణిజ్య సెల్ జిల్లా అధ్యక్షుడు పాల్వాయి రమేష్, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఇంజమూరి వెంకటయ్య మాదిగ, సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి పాల్వాయి నాగయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు జంగయ్య మరియు సిపిఐ పార్టీ మండల కార్యదర్శి రావుల సత్యం, సహాయ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, యల్లాబోయిన సింహాద్రి, మహిళా సమాఖ్య జిల్లా ఉపాధ్యక్షురాలు ఐలాపురం లక్ష్మి, పట్టణ సిపిఐ కార్యదర్శి చిలక రాజు శ్రీను మరియు ఆశా వర్కర్లు పాల్గొని సంఘీభావం తెలియజేశారు.


ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 28 మంది బడా పారిశ్రామికవేత్తలకు 69 వేల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలు రద్దు చేసిందని, పేదవారికి ఉచితంగా రెండు నెలల రేషన్ సరుకులు ఇవ్వటానికి పాలకులు తమ అనుచరులకు అప్పనంగా వేలాది కోట్ల రూపాయల దోచి పెట్టారని, ఆ ఇరవై ఎనిమిది మందిలో ఒక్కడు కూడా ముస్లిం లేడని ఒక్కడు కూడా కమ్యూనిస్టు కానీ నక్సలైట్ కానీ దళితులు కానీ బహుజనులు కానీ లేరని, వారంతా బిజెపి తొత్తులేనని విజయ్ మాల్యా అనేవాడు బిజెపి ఎంపీ అని వారి సంక్షేమమే లక్ష్యంగా బిజెపి పని చేస్తుందని అన్నారు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయని ప్రపంచంలోని అన్ని దేశాలు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గితే మనదేశంలో పెరుగుతున్నాయని, కేంద్ర ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల కేంద్ర హోం శాఖ అలసత్వం వల్ల కేంద్ర ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్ల నిజాముద్దీన్ లో జరిగిన మత ప్రార్థన ప్రచారాన్ని పసిగట్టి లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా కరోనా కరాళ నృత్యం చేస్తుందని తీరా చేతులు కాలాక కొవ్వొత్తులు వెలిగించండి అని చప్పట్లు కొట్టండి అని పాలకులు చిలక పలుకులు పలుకుతున్నారని ఆయన విమర్శించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్