కోదాడ మండలం కాపుగల్లులో ఈనెల 27 ఆదివారం బెజ్జంకిలో జరిగే స్వేరోస్ జాతీయ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా స్వేరోస్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ చెరుకుపల్లి కిరణ్ స్వేరో మాట్లాడుతూ.. 2012లో అక్షరం ఆర్థికం , ఆరోగ్యం అనే నినాదంతో ఏర్పడిన స్వేరోస్ నెట్వర్క్ అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపడం కోసం కృషి చేస్తున్నది. అలాగే ఈ సంవత్సరం జరగనున్న జాతీయ మహాసభకు వేలాదిగా తరలి రావాలని కోరారు.