కోదాడలో రంజాన్ పర్వదిన ప్రార్థనలు

1045చూసినవారు
రంజాన్ పండుగ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు కలుగజేయాలని కోదాడ పెద్ద మసీదు ఇమాం మౌలానా అబ్దుల్ ఖాద్రి రషాదీ అన్నారు. గురువారం రంజాన్ పండుగ సందర్భంగా సాలర్జంగ్ పేట ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ లో పాటించిన నైతిక జీవనం కొనసాగించాలని కోరారు. అల్లా దీవెనల తోనే రంజాన్ మాస ఉపవాస దీక్షలు విజయవంతం అయ్యాయన్నారు. ఈ సందర్భంగా ముస్లింలు ఒకరి కొకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్