తీన్మార్ మల్లన్నకు మంత్రి కోమటిరెడ్డి ఝలక్

2603చూసినవారు
తీన్మార్ మల్లన్నకు మంత్రి కోమటిరెడ్డి ఝలక్
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్నకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గట్టి ఝలక్ ఇచ్చారు. ఎన్నికల వేడి ఒకవైపు ఉండగా మంత్రి కోమటిరెడ్డి విదేశాలకు వెళ్లిపోయారు. అంతే కాదు మల్లన్నకు సపోర్ట్ చేయాలా? వద్దా అనే ఏ విషయం కూడా కార్యకర్తలకు చెప్పకుండా మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లినట్లు కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. గతంలో కోమటిరెడ్డిని రెండు పంగలు చీరి ఒకటి నార్కట్ పల్లి దగ్గర, ఒకటి నకిరేకల్ దగ్గర కడతా అని తీన్మార్ మల్లన్న తీవ్రస్థాయిలో వ్యక్తిగతంగా అవమానించే రీతిలో మాట్లాడిన విషయం తెలిసిందే. అలాంటి వ్యక్తికి ప్రచారం చేయలేకనే కోమటిరెడ్డి విదేశాలకు పయనమైనట్లు చెబుతున్నారు.
Job Suitcase

Jobs near you