రామన్నపేట: విద్యుత్ ఘాతంతో మహిళ మృతి

50చూసినవారు
రామన్నపేట: విద్యుత్ ఘాతంతో మహిళ మృతి
రామన్నపేట మండలం తుమ్మలగూడెం గ్రామానికి చెందిన ఆవుల పద్మ(45) ఆదివారం తన పొలంలో వరి కొయ్యడానికి వెళ్లగా, శనివారం రాత్రి కురిసిన వర్షానికి కరెంటు వైరు తెగి పొలంలో పడింది. అది గమనించకుండా పద్మ పొలంలోకి వెళ్ళగానే ఆ వైరు కాలికి తగిలి కరెంట్ షాక్ తో అక్కడికక్కడే మృతి చెందినది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్