ఆర్టీసీ బస్, టిప్పర్ ఢీకొన్న ఘటన నల్లగొండలో జరిగింది. వివరాల్లోకెళితే నల్లగొండ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్ పానగల్ ఫ్లైఓవర్ వద్ద టిప్పర్ని సైడ్ నుంచి ఢీ కొట్టడంతో బస్సు కుడి వైపు, లారీ పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.