మీకు బ్రేకప్ అయితే సెలవు తీసుకోండి: ప్రముఖ సంస్థ

30081చూసినవారు
మీకు బ్రేకప్ అయితే సెలవు తీసుకోండి: ప్రముఖ సంస్థ
భారతదేశంలోని ప్రముఖ ఫైనాన్షియల్ టెక్నాలజీ కంపెనీ 'స్టాక్‌గ్రో' తన ఉద్యోగుల కోసం ఒక వినూత్న విధానాన్ని రూపొందించింది. సంబంధాలు తెగిపోవడం, వ్యక్తిగత సమస్యలతో బాధపడే వారికి సెలవు ఇవ్వబడుతుంది. ఎలాంటి ప్రశ్నలు అడగబోమని, రుజువులు చూపించాల్సిన అవసరం లేదని పేర్కొంది. అవసరాన్ని బట్టి సెలవు పొడిగించుకోవచ్చని చెప్పింది. ఈ స్టాక్‌గ్రో సంస్థ 30 మిలియన్ల వినియోగదారులను కలిగి ఉంది. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అన్ని సంస్థలు ఇలానే ఇస్తే బాగుండని కామెంట్లు పెడుతున్నారు.

సంబంధిత పోస్ట్