బిహార్ రాష్ట్రంలో భాగల్పూర్కు చెందిన అమిత్ కుమార్‌కు 2022లో పార్ట్ టైమ్ టీచర్‌గా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. పేరుకు ప్రభుత్వ ఉద్యోగమే అయినా నెలనెలా చేతికి అందే మొత్తం మాత్రం ప్రైవేటు ఉద్యోగానికన్నా తక్కువ. అన్నీ పోను ఆయనకు వచ్చే జీతం రూ.8000. దానితో ఇంటిని నడపడం కష్టంగా మారడంతో డెలివరీ బాయ్‌గా అవతారమెత్తాడు. పగలు స్కూలులో వ్యాయామ ఉపాధ్యాయుడిగా, రాత్రి జొమాటో బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.