గత పదేళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైంది: సీఎం రేవంత్

68చూసినవారు
గత పదేళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైంది: సీఎం రేవంత్
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేసుకోవడం మన అదృష్టమని సీఎం రేవంత్ అన్నారు. సచివాలయంలో నూతన తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. 'గత పాలకులు జయజయహే తెలంగాణ గీతాన్ని పట్టించుకోలేదు. గత పదేళ్లలో తెలంగాణ తల్లి వివక్షకు గురైంది. అవినీతి నుంచి అభివృద్ధి వైపు తొలిఏడాది పాలన పూర్తి చేసుకున్నాం. గతంలో వివక్షకు గురైన కవులు, కళాకారులను గుర్తించి తగిన విధంగా గౌరవిస్తాం. 4 కోట్లప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్